శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ వేదిక లో సమిష్టి నిర్ణయమే !


👉 సనాతన సాంప్రదాయ ఆచారాల మేరకే !


👉 పీఠాధిపతులు, వేద పండితులు, అర్చక స్వాముల, భక్తజన అభిప్రాయాలతో నే !


👉 భక్తులు మాకు భగవంతుని స్వరూపాలు !


👉 నా ప్రాణం ఉన్నంతవరకు భగవంతుడి కార్యక్రమాలలో రాజకీయాలు చేయను !


👉 ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక

బ్రహ్మోత్సవాలలో జరగనున్న స్వామి వారి

నూతన కళ్యాణ వేదిక ఏర్పాటు లో

ఏ ఒక్కరి సొంత నిర్ణయం కాదు అని

పీఠాధిపతులు, అర్చకుల, భక్తుల, క్షేత్ర ప్రజల

సమిష్టి నిర్ణయం ప్రకారమే ఆ వేదికపై

జరగనున్నదని ధర్మపురి

ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, అన్నారు.


ధర్మపురి లో బ్రాహ్మణ సంఘ భవనంలో ఆదివారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


👉 మీడియా సమావేశంలో ప్రధాన అంశాలు !


శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో రాజకీయ ఆధిపత్యం, ప్రదర్శించాల్సిన అవసరం మాకు లేదు స్వామి పాదాల చెంత నేను సాధారణ భక్తుడిని !


👉 నేను ఎన్ని అత్యున్నత పదవులు పొందినా, నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు దేవుడిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయను !


👉 సనాతన ఆచార సాంప్రదాయాలు, ఆగమశాస్త్ర పద్ధతిలో దేవాదాయ శాఖ అధికారులు ఆదేశాలు సూచనల మేరకే స్వామి వారి కళ్యాణ వేదిక నిర్ణయం చేశారు !


👉 శ్రీ మఠం పీఠాధిపతి వారి అనుమతి, భద్రాచలం, యాదగిరిగుట్ట, ధర్మపురి, ప్రధాన అర్చకుల , భక్తుల, స్థానిక ప్రజల సమిష్టి నిర్ణయం మేరకు వేదిక ఎంపిక జరిగింది.

ప్రముఖ ఆలయాలు యాదగిరి భద్రాచలం ప్రధాన అర్చకుల అనుమతి లేఖలు, కమిషనర్ జారీచేసిన అనుమతి ఉత్తర్వులు.


👉 స్వామివారి కళ్యాణం నిర్వహించే స్థలంలో జగద్గురువులు శృంగేరి పీఠాధిపతులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీయ స్వామివారు వేద పాఠశాల నిర్మాణం కోసం 2018, జూన్ మాసంలో భూమి పూజ చేశారు.


👉 ఆగమేఘాలపై వేదిక నిర్ణయం జరగలేదు గత 20 రోజులుగా పీఠాధిపతులు, అర్చకులు అధికారులతో సంప్రదింపులు, ఉత్తర ప్రత్యుత్తరాలు


👉 రాష్ట్రం నలుమూలల నుంచి స్వామి వారి కళ్యాణం తిలకించడానికి తరలివచ్చే వేలాదిమంది భక్తుల సౌకర్యార్థం విశాలమైన స్థలం ఎంపిక చేశారు.


👉 గత మూడు రోజులుగా ఉదకశాంతి, పుణ్యా వచనం, శుద్ధి పుణ్యా వచనం, ఆగమశాస్త్ర నిబంధనల మేరకు వేద పండితులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

👉 మీరు చేస్తే సంసారం…?

👉 2022 డిసెంబర్ లో శ్రీ స్వామి వారి స్థలంలో కళ్యాణం నిర్వహించడానికి అప్పటి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చేసిన తీర్మానం ( ఫైల్ కాఫీ)

👉 టిఆర్ఎస్ ప్రభుత్వంలో 2022 స్వామి వారి కళ్యాణం శ్రీ మఠం స్థలంలో ( ప్రస్తుతం జరగనున్న కళ్యాణ వేదిక ) కళ్యాణం నిర్వహించడానికి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తీర్మానించి దేవాదాయ కమిషనర్ అనుమతి కోసం దరఖాస్తు చేశారా ? లేదా ?


👉 ఇప్పుడు అదే స్థలం లో కళ్యాణం ఎలా చేస్తారు ? ఆగమశాస్త్రం, పుణ్యా వచనం, అంటూ డబుల్ స్టాండర్డ్ మాటలు స్థానికులు గమనిస్తున్నారు.


👉 శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు, కళ్యాణం తిలకించడానికి, ప్రతిపక్ష వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు అందరూ ఆహ్వానితులే, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా గౌరవంగా వారిని ఆహ్వానిస్తున్నట్టు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.