శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి జాతరలో సీఎం రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి (కొడంగల్ బాలాజీ) వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వామి వారిని శనివారం దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి కి ఆశీర్వచనం అందించారు.


👉 ఇఫ్తార్ విందులో సీఎం !


రంజాన్ పండుగను పురస్కరించుకుని కొడంగల్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక మతపెద్దలు, ముస్లిం సోదరులతో కలిసి ముఖ్యమంత్రి ప్రార్థనలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి  ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.