శ్రీపాదరావు జయంతి వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్ధిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకల్లో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం అదృష్టం అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారి 88వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతీలొ ఆదివారం నిర్వహించింది.
జయంతి వేడుకల్లో కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉభయ సభల స్పీకర్లతో కలిసి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన ప్రసంగంలో శ్రీపాద రావు జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, పెద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప మహనీయ వ్యక్తి శ్రీ పాద రావు అని అన్నారు.


తండ్రికి తగ్గ తనయుడిగా మంత్రి శ్రీధర్ బాబు తాను 2018 లో ఎమ్మెల్యేగా తాను గెలిచి ఓడిపోయినప్పుడు శ్రీధర్ బాబు నాకు ధైర్యం చెప్పి గెలిచిన ఓడిన ప్రజల మధ్య ఉండాలని లోనుంచి అండగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు.