👉 చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పని చేస్తాం !
👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు !
J.SURENDER KUMAR,
26 ఏళ్ల కిందట నాన్నను కోల్పోయాం. కానీ… ఇప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో చిరంజీవిగానే ఉన్నారు. పార్టీలకు అతీతంగా పనిచేసి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు అనే ఆయన తనయుడు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
👉 తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఆదివారం జరిగిన దుద్దిళ్ల శ్రీపాద రావు 88వ జయంతి వేడుకల్లో సభా ప్రారంభకులు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ

👉 తన పనితీరుతో పార్టీలకు అతీతంగా అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. అందర్నీ కలుపుకొని వెళ్ళారు. ప్రజల కోసమే చివరి క్షణం వరకు తపించారు. అదే స్ఫూర్తితో ఆయన చూపిన అడుగు జాడల్లోనే మా కుటుంబ సభ్యులం నడుస్తున్నాం.

👉 నాన్న భౌతికంగా మా నుంచి దూరమైనా.. ఆయన ఆశయాలు, ఆలోచనలు మాతోనే ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బృహత్తర బాధ్యత మాపై ఉంది.
👉 మేం ప్రజలకు చేయాల్సింది చాలా ఉంది. ప్రజలు మాపై చూపించే అభిమానం, ప్రేమకు సదా కృతజ్ఞులం. మా చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పని చేస్తాం.i

👉 రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేని లోటును పూడ్చలేనిది. తనదైన పని తీరుతో రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్రను వేశారు.
👉 నాన్న జయంతిని ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించడం ఆయనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితర ప్రభుత్వ పెద్దలకు మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.

👉 ఆయన పై అభిమానంతో పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన
బీజేపీ శాసన సభ్యులు పాల్వాయి హరీష్, పైడి రాకేష్ రెడ్డి కి ధన్యవాదాలు…

కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంఎల్ఏలు మల్ రెడ్డి రంగారెడ్డి, మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.