శ్రీ సీతరాముల పెళ్లికి రండి మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం !

👉 అసెంబ్లీ ప్రాంగణంలో అరుదైన దృశ్యం !


J.SURENDER KUMAR,


భద్రాచలంలో ఏప్రిల్ 6 న జరగనున్న శ్రీ సీతారాముల వారి  కళ్యాణోత్సవంలో పాల్గొనాల్సిందిగా ఆలయ వేదపండితులు శనివారం ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను ఆహ్వానించారు.


ప్రోటోకాల్ మేరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఆధ్వర్యంలో  కమిషనర్ శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ అధికారి రమాదేవి అర్చకులు వేద పండితులతో  వారు   అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రి  దుద్దిల్ల శ్రీధర్ బాబు ను  కలిసి స్వామివార్ల కళ్యాణ పత్రికను మంత్రికి అందించారు.

7 న కనుల పండుగ గా జరగనున్న  శ్రీరామ పట్టాభిషేకం  కార్యక్రమంలో కూడా పాల్గొనాలని వేదపండితులు మంత్రి శ్రీధర్ బాబును కోరారు. 

సీనియర్ ఐఏఎస్ అధికారిని, దేవాదాయ శాఖ,  ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్,  మంత్రి శ్రీధర్ బాబు ధర్మపత్ని , ఈ అరుదైన దృశ్యం అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న వారు  చూసి సంతోషం వ్యక్తం చేశారు.