శ్రీ సీతారామ కళ్యాణముకు  సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం!

J.SURENDER KUMAR,


భక్తుల కొంగుబంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా  జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ని కలిసి మంత్రి కొండా సురేఖ , భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు ఆహ్వాన పత్రిక అందించారు.


సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు సైతం ఆహ్వానం అందించారు. భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను ముఖ్యమంత్రి  డిప్యూటీ సీఎం, మంత్రులతో కలిసి ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో భద్రాచలం రాములవారి ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ, ఇతర వివరాలను ముఖ్యమంత్రి   అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన భూసేకరణ, నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు.


ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ , భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.