శ్రీ వెంకటేశ్వర స్వామి డోలోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,


ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం బ్రహ్మ పుష్కరిణిలో జరిగిన  శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవం మరియు డోలోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. స్వామివారి తెప్పోత్సవం వెంట ఎమ్మెల్యే పుష్కరణలు ప్రదక్షిణం చేశారు, అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.


👉మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం !


కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.


జగిత్యాల జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో   ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో  ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యఅతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్  సంజయ్ కుమార్,  జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం ఎంపిక చేసిన కొందరు మహిళలను ఘనంగా సన్మానించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..


మహిళా సోదరీమణులు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సోదరీమణులకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణంను కల్పించడం జరిగిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందంటే అది కేవలం సోనియా గాంధీ వల్లనే అని అన్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మహిళ సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ లు, ఆర్టీసీ బస్సులను  కొనుగోలు చేసి నిర్వహణ బాధ్యతలు అప్పగించిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అన్నారు.