శ్రీ వేణుగోపాలస్వామి రధోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ధర్మపురి అసెంబ్లీ పరిధి గుళ్ళకోట గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి వారి రధోత్సవం సందర్భంగా శనివారం స్వామి వారిని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భగా ఆలయ అర్చకులు అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేసి శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

👉పాఠశాల వార్షిక వేడుకలలో..

ధర్మారం మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బ్రిలియంట్ మోడల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బ్రిలియంట్ మోడల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, స్కూల్స్ ప్రారంభించి నేటికీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

అన్ని దానాల్లో కన్నా  విద్యాదానం గొప్పదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్య వ్యవస్థకు పెద్ద పీట వేస్తుందని,ఇటీవల విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు,నూతన రెసిడెన్షియల్ హాస్టల్ ఏర్పాటు, వసతి గృహాల్లో మాలిక వసతుల కల్పన వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు, విద్యార్థులు జన్మనిచ్చిన తల్లితండ్రుల విద్య నేర్పిన గురువుల పేరు నిలబెట్టే విధంగా చదువుకొని గొప్ప స్థాయిలో కొనసాగే విధంగా కష్టపడాలని తెలిపారు .