J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో ఆదివారం జరిగిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ కళ్యాణం లో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందించి స్వామివారి శేష వస్త్రంతో సన్మానించారు.
👉 పైడిపల్లి గ్రామంలో …

వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సంధర్బంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, స్వామివారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందించి సన్మానించారు.
👉 పెళ్లికి ఆర్థిక సహాయం..

ధర్మపురి మండలం బూర్గుపల్లె గ్రామానికి చెందిన పేదరాలైన అంతర్పుల శైలజ వివాహం కు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ₹ 10 వేల ఆర్థిక సహాయం అందించారు. ఆదివారం జరిగిన పెండ్లి కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.