👉 తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన !
👉 మార్చి 24 నుండి అమలులోకి..
J.SURENDER KUMAR,
తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేల, ప్రజా ప్రతినిధుల లేఖల పై తిరుమలలో శ్రీవారి దర్శనం కల్పిస్తాం అని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం సోమవారం ప్రకటించింది.
ఈ నెల 24 నుంచి వీరి లేఖలు అమలులోకి రానున్నాయని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు మార్చి 24 నుండి టిటిడి శ్రీవారి దర్శనం కల్పించనుంది.
👉 దీనిలో భాగంగా, VIP బ్రేక్ దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుండి ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు ఆదివారం ఇవ్వాలి (సోమవారం దర్శనం కోసం), సోమవారం లేఖలు ఇవ్వాలి (మంగళవారం దర్శనం కోసం) మాత్రమే స్వీకరించబడతాయి.
👉 అదేవిధంగా, ₹.300 దర్శన టిక్కెట్లకు సంబంధించిన సిఫార్సు లేఖలు బుధవారం, మరియు గురువారాలలో (ఒకే రోజు దర్శనం కోసం) మాత్రమే స్వీకరించబడతాయి.
దర్శనం కోసం ఒక వ్యక్తికి ( 06 మంది సభ్యులకు మించకుండా ) ఒక సిఫార్సు లేఖ మాత్రమే అంగీకరించబడుతుంది.
👉 ఇప్పటివరకు ఆదివారం విఐపి బ్రేక్ దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన సిఫార్సు లేఖలను ఇకపై ఆదివారం దర్శనం కోసం శనివారాలలో అంగీకరిస్తారు.
తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలు, దర్శన సమయాలు మరియు ఇతర భక్తుల స్లాట్‌లను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
👉 తెలంగాణ ఎంపీ ఎమ్మెల్యేల లేఖల పట్ల టిటిడి బోర్డు చూస్తున్న వివక్షత పై సీఎం చంద్రబాబుకు
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇటీవల లేఖ రాశారు. మెదక్ బిజెపి ఎంపి రఘునందన్ రావు, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గత కొన్ని రోజుల క్రితం ఇదే అంశంపై మీడియాతో మాట్లాడుతూ టీటీడీ బోర్డు తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ వేసవి సెలవులలో మా లేఖలు పరిగణంలోకి తీసుకోకుంటే ప్రజా ప్రతినిధులను ము సామూహికంగా టీటీడీ బోర్డు వద్దకే వచ్చి తేల్చుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన విషయం విధితమే.