👉 అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క !
J.SURENDER KUMAR,
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రజా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం వార్షిక బడ్జెట్‌కు ₹ 3,04,965 కోట్ల కు ఆమోదముద్ర వేసింది. అనంతరం ఉప ముఖ్యమంత్రి తొలుత బడ్జెట్ ప్రతులను లాంఛనంగా ముఖ్యమంత్రి కి అందజేశారు.
👉 ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క బడ్జెట్ ను శాసనసభలో, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసనమండలిలో ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ₹ 3,04,965 కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రతిపాదించారు. బడ్జెట్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి , మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి ని అభినందించారు.
👉 ఇది అభివృద్ధి, సంక్షేమం పట్ల నిబద్ధతతో కూడిన ప్రజాబడ్జెట్‌గా పేర్కొంటూ ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ప్రజలకు అభినందనలు తెలియజేశారు.
👉 ఉన్నతమైన లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ సుసంపన్నత, సమగ్రత, మరియు స్థిరమైన అభివృద్ధితో కూడిన తెలంగాణను నిర్మిస్తామని 72 పేజీల బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గడిచిన 15 నెలల పాలనలో ప్రధానంగా సంక్షేమ రంగంలో తీసుకున్న చర్యలను సమగ్రంగా వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికను బడ్జెట్లో ఆవిష్కరించారు.
👉తెలంగాణ బడ్జెట్ 2025-26
👉 ₹3,04,965 కోట్లు – మొత్తం వ్యయం !
👉 ₹2,26,982 కోట్లు – రెవెన్యూ వ్యయం !
👉 ₹36,504 కోట్లు – మూలధన వ్యయం!
👉 కేటాయింపులు
👉 ₹40,232 కోట్లు – షెడ్యూల్డ్ కులాల సంక్షేమం !
👉 ₹31,605 కోట్లు – పంచాయతీరాజ్ & గ్రామీణం !
👉 ₹24,439 కోట్లు – వ్యవసాయం !
👉 ₹23,373 కోట్లు – నీటిపారుదల !
👉 ₹23,108 కోట్లు – విద్య !
👉 ₹21,221 కోట్లు – ఇంధనం !
👉 ₹17,677 కోట్లు – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ !
👉 ₹17,169 కోట్లు – షెడ్యూల్డ్ తెగల సంక్షేమం !
👉 ₹12,393 కోట్లు – ఆరోగ్యం !
👉 ₹11,405 కోట్లు – వెనుకబడిన తరగతుల సంక్షేమం !
👉 ₹5,907 కోట్లు – రోడ్లు & భవనాలు !
👉 ₹5,734 కోట్లు – పౌర సరఫరాలు !
👉 ₹3,591 కోట్లు – మైనార్టీ సంక్షేమం !
👉 ₹3,527 కోట్లు – పరిశ్రమలు !
👉 ₹2,862 కోట్లు – మహిళలు మరియు శిశు సంక్షేమం !
👉 ₹1,674 కోట్లు – పశుసంవర్ధకం !
👉 ₹1,023 కోట్లు – అడవులు & పర్యావరణం !
👉 ₹900 కోట్లు – యువజన సేవలు !
👉 ₹775 కోట్లు – పర్యాటకం !
👉 ₹774 కోట్లు – సమాచార సాంకేతికత !
👉 ₹465 కోట్లు – క్రీడలు !
👉 ₹371 కోట్లు – చేనేత !