J.SURENDER KUMAR,
వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటీ ఇబ్బందులు రాకుండా మిషన్ భగీరథ వాటర్ ను ఇంటి ఇంటికి అందించాలి, అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా అధికారుల ను ఆదేశించారు.
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరం లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రణాళిక బద్ధంగా తాగునీటి సరఫరా, అలాగే రోడ్ల మరమ్మత్తులు, సిసి రోడ్ల మరమ్మత్తులు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను దృష్టిలో ఉంచుకొని పూర్తిస్థాయిలో పనిచేయాలని అధికారులను సూచించారు.
జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత, జిల్లా వివిధ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు.
ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ రఘువరన్, ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్, ఈ పి ఆర్ ఓ, మరియు డిపిఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు