👉 క్యూబా లో మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి ప్రసంగం !
J.SURENDER KUMAR,
తప్పుడు సమాచారం మరియు మీడియా, మార్పులను ఎదుర్కోవడం అనే అంశంపై
క్యూబా దేశంలో జరిగిన ఐదు రోజుల సెమినార్ లో తెలంగాణ ప్రభుత్వం మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి ప్రసంగించారు.

క్యూబా దేశంలోని హవానా విశ్వవిద్యాలయంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న నాల్గవ అంతర్జాతీయ సంభాషణ సదస్సుకు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి ని భారతదేశ ప్రతినిధిగా నిర్వాహకులు ఆహ్వానించారు.
ప్రపంచంలోని ఆయా దేశాల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సును క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కానెల్ ప్రారంభించారు.

సెమినార్ లో ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల హక్కులు, మీడియా సంస్థల యాజమాన్యాల విధులు, బాధ్యతలు, విధుల నిర్వహణలో, జర్నలిస్టుల బాధ్యతలు, సామాజిక స్పృహ, తదితర అంశాలపై గణాంకాలతో, కొన్ని సంఘటనలు, సందర్భాలు, జర్నలిస్టులపై దాడులు తదితర అంశాలు శ్రీనివాస్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొంటూ నివేదికను ప్రజెంటేషన్ చేశారు.