తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే ఎంపీల సిఫారసు లేఖల పై….


👉 శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 6 వందల మంది !


J.SURENDER KUMAR,


తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై (మొదటి రోజు) సోమవారం  శ్రీవారిని ఆరువందల మంది  భక్తులు దర్శనం చేసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు  ట్వీట్ చేశారు.
తొలిరోజు 550 నుండి 600 మంది వరకు తెలంగాణా లెటర్స్ పై విఐపీ బ్రేక్ దర్శనాలను కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


శ్రీవారి దర్శనభాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు  ఉన్నతాధికారులకు భక్తులు ధన్యవాదాలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
మంచి దర్శనం, వసతి కల్పిస్తున్న టీటీడీ అధికారులకు భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.