👉 మేము తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం !
👉 బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అల్టిమేట్ !
J.SURENDER KUMAR,
తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీల దర్శన సిఫారసు లేఖలు ఎందుకు పరిగణంలోకి తీసుకోవడం లేదు, టీటీడీ బోర్డు ఇదే తరహాలో ప్రవర్తిస్తే మా ఎమ్మెల్యేలు ఎంపీలు తిరుమలకు వచ్చి తేల్చుకుంటామని మెదక్ బిజెపి పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు శుక్రవారం తిరుమలలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ నేతల లేఖ లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ సీఎం సూచించినా.. టీటీడీ బోర్డు నిర్ణయించినా అధికారులు ఎందుకు పరిగణ లోకి తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారం పై టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసారు. పరిస్థితిలో మార్పు రాకుంటే తమ కార్యాచరణ ఏంటో తేల్చి చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వ వినతి మేరకు ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల లేఖ లను పరిగణలోకి తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి టీటీడీకి సూచించారు. ఈ మేరకు నిబంధనలు సైతం ఖరారు చేసారు. ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలు అమలు అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు.
దీంతో, తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు తిరుమలలో దర్శనం. వసతి కోసం ప్రజా ప్రతినిధులు లేఖలు ఇస్తున్నారు. అయినా టీటీడీ బోర్డు పట్టించుకోవటం లేదంటూ తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే క్రమంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసారు. ఇదే నేపథ్యంలో శుక్రవారం వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సైతం టీటీడీ బోర్డు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పిభ్రవరి 1వ తేదీ నుంచి పరిగణలోకి తీసుకొనేలా తొలుత నిర్ణయం జరిగింది. అయితే.. అమలు మాత్రం జరగటం లేదంటూ తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
👉ఉమ్మడి రాష్ట్రంలో ఎలా జరిగింది !
తిరుమల లో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారస్సు లేఖల పట్ల వివక్ష బాధాకరమన్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని గుర్తు చేసారు. ఉమ్మడి ఏపీలో 294 మంది ఎమ్మెల్యేలకు బ్రేక్ దర్శనాలు, అకామిడేషన్ ఇచ్చేవాళ్ళని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర విభజన తరువాత.. ఆంద్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల లేఖలు మాత్రమే అనుమతించడం బాధా కరమని పేర్కొన్నారు. లెటర్లు ఇవ్వమని వాళ్ళె చెప్పారు, అకామిడేషన్ ఇవ్వలేమని కూడా వాళ్ళే చెబుతున్నారుని వ్యాఖ్యానించారు.
వివక్ష పట్ల టిటిడి బోర్డు వెంటనే ఆలోచన చేయాలని కోరారు. పార్టీలకు అతీతంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. సెలవులలో లెటర్లు పంపిస్తామని చెప్పిన ఎంపీ రఘనందన్… అనుమతించకపోతే అందరు ఎమ్మెల్యేలు వస్తామని ఎంపీ రఘునందన్ రావు టీటీడీ బోర్డుకు అల్టిమేటం ఇచ్చారు.