J.SURENDER KUMAR,
వనపర్తి జిల్లాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఆదివారం జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పర్యటన ఇలా కొనసాగింది.

ముందుగా స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దైవ దర్శనం చేసుకున్నారు. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల ఆశీర్వచనం అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి , ఎంపీ మల్లు రవి , స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు.
👉 శంకుస్థాపనలు..

వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, కొత్త ఐటీ టవర్, కొత్త ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, జిల్లా పరిషత్ (బాలుర) పాఠశాల, జూనియర్ కాలేజీ భవనాల నిర్మాణం, శ్రీ రంగాపురం దేవాలయం అభివృద్ది పనులు, పెబ్బేరులో 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం, రాజానగరం – పెద్దమందడి బీటీ రోడ్డు నిర్మాణ పనులు, ఎస్టీ హాబిటేషన్ వర్కింగ్ భవనం, పట్టణంలో సీసీఆర్ రోడ్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , ఇతర అధికారులు పాల్గొన్నారు.
👉 మైనారిటీ కార్పొరేషన్..

వనపర్తిలోని కేడీఆర్ పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సందర్శించారు. కార్పొరేషన్ ద్వారా మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అలాగే, రుణమేళా,జాబ్ మేళా స్టాల్స్ ను సందర్శించిన సీఎం లబ్దిదారులకు చెక్కులు అందజేశారు.