వరి పంట కొనుగోలుకు సిద్ధం కావాలి కలెక్టర్ సత్య ప్రసాద్ !


👉 ధాన్యం రవాణా కు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉంచాలి !


J.SURENDER KUMAR,


జగిత్యాల  కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం డి ఆర్ డి ఓ , రెవెన్యూ , ట్రాన్స్పోర్ట్ , అధికారులు మిల్లర్ల అసోసియేషన్, అదనపు కలెక్టర్ బి.ఎస్.లత తో కలసి యాసంగి ధాన్యం కొనుగోలు సన్నద్దత పై కలెక్టర్ బి సత్యప్రసాద్  సమీక్ష సమావేశం నిర్వహించారు.


యాసంగి మార్కెటింగ్ సీజన్ లో నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను తూచా తప్పకుండా పాటిస్తూ మద్దతు ధర పై వరి పంట కొనుగోలుకు సన్నద్ధం కావాలని అన్నారు.

👉 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ…

యాసంగి మార్కెటింగ్ సీజన్ 2024-25 లో  ఎటువంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు నాణ్యమైన వడ్లను మద్దతు ధరపై కొనుగోలు చేసి 48 గంటల్లో చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు. 

👉 జగిత్యాల జిల్లాలో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని, దీనికి తగ్గట్టుగానే అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో అవసరమైన మేర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు.

👉 జిల్లాలో మొత్తం 424 వరి ధాన్యం కొనుగోలు సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో ఐకెపి ద్వారా 132 కేంద్రాలు,పిఎసిఎసి ద్వారా 291 కేంద్రాలు మెప్మా ద్వారా 1 కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

👉 ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్ఫాలిన్, తేమ యంత్రాలు, క్లీనింగ్ మిషన్లు  వెయింగ్ యంత్రాలు గన్ని బ్యాగులు మొదలకు సామాగ్రి అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

👉 మార్కెటింగ్ అధికారితో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సామాగ్రి కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.

👉 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు, దొడ్డు వడ్లకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పంట కోతలు జరిగేటప్పుడు హార్వెస్టర్లతో కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

👉 కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు త్వరితగతిన తరలించాలని అన్నారు . రైస్ మిల్లులో ఎట్టి పరిస్థితుల్లోనూ తాలు కట్ చేయడానికి వీలు లేదని, నాణ్యతను కొనుగోలు కేంద్రాల దగ్గరే పరిశీలించి పంపాలని అన్నారు. 

👉 కొనుగోలు కేంద్రాల వద్ద, రైస్ మిల్లుల వద్ద ఎక్కడ హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

👉 వేసవికాలం నేపథ్యంలో ఐకెపి కొనుగోలు కేంద్రాల వద్ద త్రాగునీరు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో ,అదనపు కలెక్టర్ బి.ఎస్ లత జిల్లా డీఎం మార్కెటింగ్ అధికారి, జితేందర్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జితేందర్ రెడ్డి సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.