వెంకటేశ్వర స్వామి జాతరలో ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కుమార్, డాక్టర్ వివేక్ !


J.SURENDER KUMAR,


ధర్మపురి అసెంబ్లీ పరిధి ధర్మారం మండలం గోపాలరావు పేటలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్  పాల్గొన్నారు. ఎమ్మెల్యేలను ప్రజలు ఘనంగా స్వాగతించారు


శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకొని వారు ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ పక్షాన స్వామివారి ప్రసాదం శేషా వస్త్రాన్ని బహుకరించారు.


అనంతరం ధర్మారం మండలం  నర్సింహులు పల్లె గ్రామంలో నిర్వహిస్తున్న ఎల్లమ్మ తల్లి జాతర కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల ఎమ్మెల్యే  జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద వేయించిన కరెంట్ స్తంభాలను పరిశీలించారు. ఆలయానికి విద్యుత్ సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

👉 వెలగటూరు మండలంలో..


వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన నరసింహ స్వామి రధోత్సవంలో
ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.