J.SURENDER KUMAR,
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని కష్టపడి చదివి ఉన్నత శిఖరాల అధిరోహించాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి పట్టణ కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబాపులే డిగ్రీ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
అనంతరం వార్షికోత్సవం సందర్భంగా కళాశాలలో నిర్వహించిన క్రీడ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసారు.

ఈ సందర్భంగా జ్యోతిబాపులే డిగ్రీ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనందుకు చాలా సంతోషంగా ఉందని, విద్యార్థులకు ఎటువంటి అవసరం ఉన్న నా దృష్టికి తీసుకురావాలని, కలశాల భవనం చిన్నదిగా ఉండటం వల్ల కొంత ఇబ్బంది ఉందని చెప్పడం జరిగిందని, త్వరలోనే మరో భవనంలోకి తరలిస్తామని అన్నారు.
విద్యార్థులు వసతి విషయంలో, భోజనం విషయంలో, విద్య విషయంలో ఎక్కడ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.