విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అసెంబ్లీలో బిజీ !

J.SURENDER KUMAR

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల నామినేషన్ ల సందర్భంగా సోమవారం అసెంబ్లీ లో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతూ బిజీ బిజీగా కొనసాగారు.


సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు , టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో అసెంబ్లీ లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థులతో నామినేషన్లు సకాలంలో అందచేయడం, న్యాయ కోవిదులతో నామినేషన్ పత్రాలు సరి చూసుకున్నారు.


ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్‌ నాయక్, విజయశాంతి, మిత్రపక్షం సీపీఐ అభ్యర్థిగా సత్యం యాదవ్ లు తమ నామినేషన్ లు ఎన్నికలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.