👉 మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు !
J.SURENDER KUMAR,
నిరుద్యోగ యువత నైపుణ్య శిక్షణ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి మండలంలో యువత కోసం నైపుణ్య అభివృద్ధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్టు భవనంలో బుధవారం జిఎంఆర్ వరలక్ష్మి పౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ కోర్సులు హోమ్ ఎయిడ్ హెల్త్ నర్సింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్,టైలరింగ్, బ్యూటిషన్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతి, యువకులకు మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ధ్రువీకణ పత్రాలను పంపిణీ చేశారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కి సంబంధించిన సంస్థలు ముందుకు వచ్చి ఎంతోమంది పేద యువతకు వృత్తి విద్యా కోర్సుల్లో నైపుణ్యతను పెంచి, ఉద్యోగ అవకాశాలు అందించాలని, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని అన్నారు.
👉 ప్రతిమ ఫౌండేషన్ సహాకారంతో…
ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట్ గ్రామంలోని టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో బ్యాంకింగ్, సోలార్, ఏసి టెక్నీషియన్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు, ప్రస్తుతం పలు కోర్సుల్లో ఉపాధి శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతతో సాగర్ జి ముచ్చటించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
.గిరిజన గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువతీ,యువకులు నైపుణ్య కేంద్రాలు కల్పించే శిక్షణను అందిపుచ్చుకొని అభివృద్ధిని సాధించాలని భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలను ఈ శిక్షణ కేంద్రాలకు కల్పిస్తామని సూచించారు.
ఈ కార్యక్రమంలో.. టాటా స్ట్రైవ్
ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, సతీష్ కుమార్, రాజశేఖర్, జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ప్రోగ్రాం అధికారి మొయ్య మహేష్, ప్రతిమ ఫౌండేషన్ మార్కెటింగ్ మేనేజర్ కౌశిక్, ఫౌండేషన్ మేనేజర్ వంగ గీతారెడ్డి, చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ఇన్చార్జి ఏఎం రాజు రెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధులు రాజారెడ్డి, రఘుపతి, శ్యామల, విజయ తదితరులు పాల్గొన్నారు.