అధైర్య పడకండి అండగా ఉంటాం ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉 ఇందిరమ్మ ఇల్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగం, NRI పాలసీ కింద ₹ 5 లక్షల ఎక్స్ గ్రేషియా !

👉 మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

మీ కుటుంబానికి అండగా ఉంటాము, అధైర్య పడకండి అన్ని విధాలుగా ఆదుకుంటా, కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, ఎన్నారై పాలసీ ద్వారా ₹ 5  లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దుబాయిలో హత్యకు గురి అయిన స్వర్గం శ్రీనివాస్ కుటుంబం సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

ధర్మపురి మండలం ధమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం దుబాయ్ లో బేకరీలో పని చేస్తుండగా, గత మూడు రోజుల క్రితం అక్కడ పాకిస్తాన్ వ్యక్తి చే శ్రీనివాస్ హత్యకు గురి అయిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  బుధవారం దమ్మన్నపేట గ్రామానికి వెళ్లి  శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.  వివరాలు అడిగి తెలుసుకున్నారు.   ₹ 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందించారు.

👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

శ్రీనివాస్ హత్యకు గురికావడం చాలా బాధాకరమని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇండియన్ రాయబార కార్యాలయ అధికారులతో చర్చించి, శ్రీనివాస్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, వారికి హామీ ఇచ్చారు.


నా నియోజకవర్గానికి చెందిన బాధిత  కుటుంబానికి ప్రభుత్వం పక్షాన అన్ని విధాలుగా అండగా  ఉండి,  శ్రీనివాస్ కుమారుడికి అవుట్సోర్సింగ్  ఉద్యోగంతో పాటు,  ఇందిరమ్మ ఇల్లు, NRI పాలసీ కింద ప్రభుత్వం తరపున ₹ 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందేలా చర్యలు చేపట్టడం నా బాధ్యత అని ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు.
మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వెంట ఉన్నారు.