J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గంలోని మండలాలలో గల ఆలయాలను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పర్యటించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు.

👉 రథోత్సవంలో…

పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ రథోత్సవంలో పాల్గొన్నారు.
👉 వెల్గటూరు మండలంలో..

వెల్గటూర్ మండలం పాతగుడూరు గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి విగ్రహ పున: ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

👉 భూమి పూజ కార్యక్రమంలో..

వెల్గటూర్ మండలం మోక్కట్రావుపేట గ్రామంలో శుక్రవారం రోజున నిర్వహించిన హనుమాన్ విగ్రహనికి భూమి పూజ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
👉 గొల్లపల్లి మండలంలో..

గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలో శ్రీ గుండు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం భక్తుల సౌకర్యార్థం దేవాలయ ఆవరణలో సుమారు ₹ 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు
👉 ధర్మారం మండలంలో..

ధర్మారం మండలం ఖిలవనపర్తి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.