👉 డి.రామ్ సుధాకర్ రావు !
J.SURENDER KUMAR,
భారత రాజ్యాంగ రచన రూపంలో బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన మేలు వెలకట్టలేనిదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దామెర రామ్ సుధాకర్ రావు అన్నారు.
బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్బంగా బుగ్గారం బిజెపి మండల అధ్యక్షులు మేడవేణి శ్రీధర్, మంచే రాజేష్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ సుధాకర్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు ప్రపంచ దేశాలు కూడా అనుసరిస్తున్నాయని అన్నారు. గొప్ప మహానుభావుడు జన్మించిన ఈ భారత గడ్డపై మనం జన్మించడం మన అదృష్టం అని అన్నారు. అంబేద్కర్ కొందరి వాడు కాదని అందరి వాడని అన్ని వర్గాల కొరకు పని చేసిన గొప్ప ఆదర్శమూర్తి అని అన్నారు. ఈరోజు ఆయన మార్గంలో యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు

ఈసమావేశంలో ఓరుగంటి చంద్రశేఖర్, కస్తూరి సత్యం, బండారి లక్ష్మణ్, గాజు భాస్కర్, కుమ్మరి తిరుపతి, గోపతి జనార్ధన్, లవన్, మందపల్లి శ్రీనివాస్, సంగేపు గంగారం, పల్లికొండ అనిల్, ఆకుల రాజు, బండారి సత్తయ్య, చిట్ల సునీల్, దొనకండి నరేష్, గుంటి ఐలెన్, గడ్డం మహేష్, బండ్ర హరీష్, కప్పల నరేష్, వడుకాపురం సతీష్, సోమా మల్లేష్, నక్కరాజు, రామ్ చరణ్, కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, పంచిత ధర్మరాజు, సంపత్ రావు, సూరజ్, శ్రీధర్, మాధవ్, హరీష్, రాందాస్, విజయ్, వెంకటగిరి, మహేష్, తదితరులు ఉన్నారు.
👉బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం !

కొద్ది రోజుల క్రితం దుబాయిలో పాకిస్తాన్ వ్యక్తి చేతిలో హత్యకు గురైన ధర్మపురి మండలంలోని దమ్మన్నపేట గ్రామస్తుడు సర్గం శ్రీనివాస్ కుటుంబాన్ని కి.బీజేపీ రాష్ట్ర నాయకులు దామెర రామ సుధాకర్ రావు పమర్శించి వారి కుటుంబానికి ₹ 10 ఆర్థిక సహాయాన్ని అందించారు.
అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తామని శ్రీనివాస్ మృతదేహం వచ్చేందుకు తెలంగాణ కేంద్ర మంత్రులు బండి సంజయ్ , కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్ విదేశీ వివరాల శాఖ నుండి దుబాయ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ అతి త్వరలో మృతదేహాన్ని మన భారత దేశం కు తరలించాలని విధం గా ప్రయత్నం చేస్తున్నారు అనేవారికి వివరించారు. శ్రీనివాస్ కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటా అని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ,పట్టణ మండల, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు