👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
అంగన్వాడీ కేంద్రాల్లో అందించే సేవలను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా అంగన్వాడి ప్రీ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఎంతో చురుకుగా ఉంటారని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా “మహిళా అబివృద్ది, శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో శుక్రవారం “పోషణ అభియాన్ పథకం ద్వారా పోషణ పక్షం – పోషణ జాతర మరి అంగన్ వాడి కేంద్ర పిల్లల గ్రాడ్యుయేషన్ డే ’ ను ఘనంగా నిర్వహించారు,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు చాలావరకు అద్దె భవనాల్లో మరియు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం అనేది సమస్యగా ఉండేది అందుకని రాష్ట్ర ప్రభుత్వం కృషిచేసి అంగన్వాడి కేంద్రాలు కొత్త భవనాలను నిర్మించుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. పోషణ పక్షం – పోషణ జాతర కార్యక్రమన్ని నిర్వహించిన ముఖ్య నిర్వాహకులు జిల్లా సంక్షేమ అధికారి డా.భోనగిరి నరేష్ ను మరియు శాఖ సిబ్బందిని ఎమ్మెల్యే అభినదించారు.
ఈ సందర్భంగా పోషణకు సంబంధించి వివిధ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది,అందులో ముఖ్యంగా బాలమృతం తో తయారు చేయబడిన పోషక ఆహార పదార్థాల యొక్క స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు సామాజిక వేడుకలు లో భాగముగా సీమంతాలు అక్షరభ్యాసం, అన్న ప్రసన కార్యక్రమాలు నిర్వహించారు.

పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమాల యొక్క స్టాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అంగన్వాడి కేంద్రంలో విద్యను అభ్యసించే ప్రీ స్కూల్ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది , ఈ సందర్భంగా అంగన్వాడి ప్రీ స్కూల్ సిలబస్ లో భాగంగా కార్యక్రమానికి వచ్చినటువంటి అంగన్ వాడి కేంద్రం యొక్క పిల్లలచే ఆటపాటలతో కూడిన సిలబస్ లో ఉన్న అన్ని రకాల అంశాలతో కూడిన కార్యక్రమాలను పిల్లలు స్వయంగా చేశారు ఈ కార్యక్రమాలను ఆకర్షణీయంగా వీక్షించారు,
అడిషనల్ కలెక్టర్ లతా మాట్లాడుతూ ఈ పోషణ అభియాన్ పథకం ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించేందుకు పోషణ పక్షం అనే కార్యక్రమాల ద్వారా సరైన పోషణ ఆరోగ్య తెలంగాణ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ అవగాహన కల్పించి మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని ఇటువంటి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మరియు అంగన్వాడి కేంద్రాలలో అందించే సేవలను మరియు ప్రీస్కూల్ విద్యను తల్లిదండ్రులు అందరు కూడా ఉపయోగించుకోవాలని కోరారు

జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ భోనగిరి నరేష్ మాట్లాడుతూ
అంగన్వాడీ టీచర్ సమాజంలో ఏ విధమైన పాత్రను ఏవిధంగా పోషిస్తున్నదో ,ఏ విధంగా ఒక అంగన్వాడి టీచర్ గా సేవలు అందిస్తుందో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. అంగన్వాడి కేంద్రాలలో ప్రీస్కూల్ సిలబస్ అనేది నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ప్రత్యేకమైన సిలబస్ రూపొందించడం జరిగిందని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అంగన్వాడి కేంద్రాలలో ప్రీస్కూల్ ఉన్నాయన్నారు.
ఈ అవకాశాన్ని అందరు తల్లి దండ్రులు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు .
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓలు మమత ,వాణిశ్రీ ,వీరా లక్ష్మి మణెమ్మ మరియు డిసిపిఓ హరీష్ మరియు జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ మధు కుమార్, పోషణ అభియాన్సీ సిబ్బంది, ఐసిపియస్ సిబ్బంది,వికలాంగులు,వయోవ్రుద్ద్దుల సంక్షేమ శాఖ సిబ్బంది,మిషన్ శక్తి సిబ్బంది , మరియు సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు,ఆయాలు మరియు అంగన్ వాడి లబ్ధిదారులు, తల్లిదండ్రులు,పిల్లలు పాల్గొన్నారు.