అర్హులైన పేదలకు సన్న బియ్యం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

తెలంగాణ  ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం అర్హులైన ప్రతి పేదవాడికి, అందించడంతోపాటు,
అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను కూడా త్వరితగతిన అందజేస్తామని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో భాగంగా శనివారం  గొల్లపెల్లి మండల కేంద్రంలో ధర్మారం మండల కేంద్రం మరియు పత్తిపాక, నర్సింగాపూర్ గ్రామాలలోని రేషన్ దుకాణాల్లో  ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పంపిణీ చేశారు.


డా.బాబు జగ్జీవన్ రామ్  జయంతి సందర్భంగా గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా.బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


👉 ₹ 2.50 లక్షల ఎల్ఓసి అందజేత !


వెల్గటూర్ మండలం ముక్కట్రవ్ పేట గ్రామానికి చెందిన ఎర్రగోకుల పర్జన్య కు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం మంజూరు చేసిన ₹ 2 లక్షల 50 వేల రూపాయల LOC నీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం ధర్మపురిలోని  క్యాంపు కార్యాలయంలో పర్జన్య కుటుంబానికి అందించారు.