👉 ఇంటర్మీడియట్ లో 994 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండవ ర్యాంక్ !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం అటవీ గ్రామం తుంగూర్ కు చెందిన కొల్లూరు ప్రణతి ఇంటర్మీడియట్ లో 994 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంక్ సాధించింది. ప్రతిభ చాటింది.
వివరాలిలా ఉన్నాయి.
కొల్లూరి ప్రభాకర్ జయ దంపతుల చిన్న కూతురు కొల్లూరి ప్రణతి కరీంనగర్ ట్రినిటీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతుంది. ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు 994 మార్కులు సాధించింది.
మారూముల గ్రామానికి చెందిన ప్రణతి ఉత్తమ ఫలితాలు సాధించడంతో గ్రామస్తులు అభినందించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కూడా రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిందని తల్లిదండ్రులు వివరించారు. ప్రణతి మాట్లాడుతూ ఇంజనీరింగ్ లో ఉన్నత చదువులు చదివి మంచి ఇంజనీర్ గా ఎదిగి ఉన్నత స్థాయిలో నిలబడాలన్నది తన లక్ష్యమని తెలిపింది.
👉 ప్రణతిని అభినందించిన గ్రామస్తులు !

ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించింది. రాష్ట్రస్థాయి రెండవ ర్యాంకు సాధించిన ప్రణతిని గ్రామస్తులు అభినందించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మాజీ అధ్యక్షులు చుక్కరాజేందర్, బీర్పూర్ మండల మున్నూరు కాపు ప్రధాన కార్యదర్షి చుక్క జనార్ధన్. గుండ సత్యం. మ్యాడ సుధకర్. కంది రమేష్. జర్నలిస్ట్ పోకల హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు