బాధిత కుటుంబానికి అండగా…

J.SURENDER KUMAR,


తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు చిన్నారుల బాధిత కుటుంబాని కి అండగా నిలిచి  మనోధైర్యాన్ని కుల సంఘ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు.   


ధర్మపురి మండలంలోని నక్కలపేట గ్రామానికి చెందిన పుట్ట నర్సయ్య యాదవ్, సంవత్సరం క్రితం మరణించగా గత కొన్నిరోజుల క్రితం నరసయ్య భార్య జమున మరణించింది.  వారి ఇద్దరి కుమారులు  శరత్, సన్నీ ఇద్దరు ఆనాధలు అయ్యారు.  ఈ విషయం తెలుసుకొని జిల్లా, మండల యాదవ సంఘము నాయకులు ధర్మపురి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంగ నర్సింహులు యాదవ్  ఆధ్వర్యంలో మండల యాదవ నాయకులు ₹ 11 వేలు నగదు, 50 కిలోల బియ్యం వారికి అందించారు. 

జగిత్యాల అఖిల భారత యాదవ మహా సభ అధ్యక్షులు పలుమారి మల్లేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి వెంకట స్వామి యాదవ్, దండవేణి గంగామల్లు యాదవ్,  మాజీ డైరెక్టర్, జెల్ల పెద్ద బుచ్చన్న యాదవ్, బుసా మల్లేష్ యాదవ్, జెల్ల చిన్న బుచ్చన్న యాదవ్, జంగం శేఖర్ యాదవ్, సమ్మెట తిరుపతి యాదవ్, తాడుక తిరుపతి యాదవ్, యాదగిరి గంగామల్లు యాదవ్, తిరు పతి, మల్లేష్, మురళి, మండేన్న, బుచ్చన్న, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు