J.SURENDER KUMAR,
ఉపాధి హామీ నిధుల కింద మంజూరు గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామంలో ₹ 30 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించినున్న సీసీ రోడ్డు పనులకు శుక్రవారం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భూమి పూజ చేశారు.

అనంతరం గ్రామంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కమిటి సభ్యులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సన్మానించారు.
👉 ఎమ్మెల్యే పాదయాత్ర…

జై బాపు- జై భీమ్ -జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఎండపెల్లి మండలం ఎండపెల్లి నుండి రాజారాంపల్లి చౌరస్తా వరకు నిర్వహించిన పాదయాత్రలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇంచార్జి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ తో కలిసి పాల్గొన్నారు.

అనంతరం ఎండపెల్లి మండల కేంద్రానికి చెందిన శరణ్య ఫుడ్ బాల్ పోటీలో జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయిన సందర్భంగా మండల పార్టీ కార్యక్రమంలో శరణ్యను సన్మానించి అభినందించారు. ఆర్థికంగా ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్న అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు.