👉 మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు 26 వ వర్దంతి సందర్భంగా…
J.SURENDER KUMAR,
చిల్లర రాజకీయాలకు మా కుటుంబం ఎప్పుడు దూరంగా ఉంటుందని ప్రజాసేవలో మేము ఎల్లప్పుడూ ముందుకెల్తం అని ప్రజలకు సేవ చేయడానికి మా కుటుంబం ఉందని ఐటి, పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.

మంథని మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆజాత శత్రువు, స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు 26వ వర్దంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఘనంగా నివాళులర్పించారు.

మంథని పట్టణంలోని శ్రీపాద చౌక్ మరియు రావుల చెరువు కట్టలోని శ్రీపాద రావు విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజాభిమానాన్ని చురగొన్న గొప్ప నాయకుడు శ్రీ పాద రావు , శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం మంథని ప్రాంతానికి ఎన్నో విధాలుగా అభివృద్ధి పనులు చేసిన శ్రీపాద రావు 26వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ….

👉 ఏప్రిల్ 13వ తేదీ 1999 జరిగిన సంఘటన ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు, ఇప్పటికి మర్చిపోలేదు ఒక కుటుంబ సభ్యుని కోల్పోయిన విధంగా గుర్తు చేసుకుంటూ నేటి వరకు కూడా మర్చిపోలేదు అంటే ఇది మాకు ఒక స్ఫూర్తిదాయకమైన విషయం అని అన్నారు
👉 మా తండ్రి మరణం అనంతరం వారి అడుగుజాడల్లో నడవాలని ఉద్దేశంతో వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని వారి ఆశయ సాధన కోసం పని చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

👉 కాంగ్రెస్ పార్టీ కష్ట సమయంలో మా వేన్నంటి ఉండి మాకు చేయూతను అందించినా నాయకులకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు అనుబంధ సంఘాల నాయకులకు పేరు పేరునా మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల,పట్టణ, అన్నీ విభాగాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.