J.SURENDER KUMAR,
జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి భారత రాయబారి శిబు జార్జ్ బుధవారం విందు ఇచ్చారు.
ఈ విందు జపాన్ రాజధాని టోక్యోలోని 100 ఏళ్ల నాటి ఇండియా హౌస్‌లో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధికార ప్రతినిధుల బృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది.

రాష్ట్ర స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడానికి జపాన్ పర్యటన చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి, అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలో భారత రాయబారి ఆధ్వర్యంలో ఏర్పాటైన విందు కార్యక్రమంలో పాల్గొని ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి జపాన్ సహకారం మరింత బలపడాలని సీఎం ఆకాంక్షించారు.
భారత రాయబారి ఇచ్చిన విందులో జపాన్‌లో ఉన్న డీఎంకే ఎంపీ శ్రీమతి కనిమొళి కరుణానిధి, మాజీ సహాయ మంత్రి, ఎంపీ నెపోలియన్ కూడా పాల్గొన్నారు.