J.SURENDER KUMAR,
చెన్నైలోని సింగపూర్ కాన్సూల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తో మర్యాద పూర్వకంగా భేటీ అయింది.
జూబ్లీహిల్స్ నివాసంలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో పాంగ్ తో పాటు సమావేశంలో కాన్సూల్ (పొలిటికల్) వైష్ణవి వాసుదేవన్ , ఫస్ట్ సెక్రటరీ (ఎకానమిక్) వివేక్ రఘు రామన్ , ఎంటర్ ప్రైజ్ సింగపూర్ రీజినల్ డైరెక్టర్ (ఇండియా – సౌత్) డేనిస్ టామ్ , రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ , హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ అధికారిణి జొన్నలగడ్డ స్నేహజ ఇతర అధికారులు పాల్గొన్నారు.
👉 తెలంగాణ కు గర్వకారణం !

మహిళల షూటింగ్ ఈవెంట్‌లో ఈషా సింగ్ పతకం సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచారని ముఖ్యమంత్రి అన్నారు. క్రీడల్లో మహిళలు సత్తా చాటడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) వరల్డ్ కప్ 2025 లో హైదరాబాద్‌కు చెందిన ఈషా సింగ్ 25 మీ. మహిళల పిస్టల్ ఈవెంట్‌లో రజత పతకం సాధించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.