కాంగ్రెస్ పాలనలో ధనవంతులు తినే బియ్యమే పేదలు తింటారు !

👉ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్.


J.SURENDER KUMAR,

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో తెలంగాణ లో  ధనవంతులు తినే బియ్యమే పేద ప్రజలు రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం నేటి నుండి తినబోతున్నారని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

నియోజకవర్గంలో ధర్మారం మండలం కటికనపల్లి, మేడారం, ధర్మపురి పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో  పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష , జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ లత అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్  మీడియాతో మాట్లాడుతూ…

గత 10 సంవత్సరాలు  బిఆర్ఎస్  అరాచక పరిపాలనకు చరమ గీతం పాడి  ప్రజలు మార్పు కోరుకోవడంతో  కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిందన్నారు.
రాష్ట్ర ప్రజల ఆశాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి  ఏ బియ్యం అయితే తింటున్నారో, రాష్ట్ర ప్రజానీకం కూడా అదే బియ్యం తినాలన్న సంకల్పం తో ఒక్కో రేషన్ కార్డు పైన ఎంత మంది ఉంటే  ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వనికి ధన్యవాదాలు తెలిపారు.


ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్,₹ 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని, గత ప్రభుత్వంలో పాలకులు ప్రజలకు సన్నబియ్యం అందించాలన్న ప్రయత్నం కూడా చేయలేదని, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
ధర్మారం మండలం పర్యటనలో కూడా సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు మేడారం గ్రామంలో ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగిందనీ, మేడారం గ్రామ అభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు .

👉 ధర్మపురి మండలానికి 3 వేల 3 వందల క్వింటాళ్ల సన్న బియ్యం !

ధర్మపురి మండలంలో 39 రేషన్ షాపులకు గాను 18 వేల 5 వందల 35 తెల్ల రేషన్ కార్డులు ఉండగా, 52 వేల 7 వందల 96 మంది లబ్ధిదారులకు 3వేల 3 వందల 25.57 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని రేషన్ షాపులకు ప్రభుత్వం పంపిణీ చేసిందని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.


అదే విధంగా రేషన్ డీలర్లు కూడా ₹ 5వేల రూపాయల గౌరవ వేతనం, బియ్యం సరఫరాలో తరుగు,హమాలీ ఖర్చులు వంటి కొన్ని సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగిందని,వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకెళ్తామని, కాంగ్రెస్ పార్టీ రేషన్ డీలర్లకు అన్ని విధాల అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.