కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కేటాయించాలి !

👉 ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


కేంద్ర ప్రభుత్వం చేసిన విద్య హక్కు చట్టాన్ని  రాష్ట్రంలో అమలు జరిగే విధంగా మరియు కార్పొరేట్ స్కూల్ సీట్లలో లో 25 శాతం మేర ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గాల విద్యార్థులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.


జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న   తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ను శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో లక్ష్యం కుమార్ వినతి పత్రం ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ లత తో కలిసి సమీక్షలో పాల్గొన్నారు


ధర్మపురి మండలంలోని గాదెపల్లె శివారులో దాదాపు రెండు వందల అరవై ఎకరాల ప్రభుత్వ మిగులు భూమీలో కొంత భూమిని ఇతర వ్యక్తులు ఆక్రమించారని, నేను గెలిచిన  వెంటనే రెవెన్యూ అధికారులను ఇట్టి విషయం పైన విచారణ జరిపించాలని  ఆదేశించానన్నారు.


ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను లాక్కున్నరో వాటిని రద్దు చేసి అర్హులైన పేదవారికి ప్రభుత్వ భూమి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లా లోని అన్ని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించి రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని తెలిపారు కోరారు.