👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి ప్రజల తాగునీటి కోసం గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం కింద డబ్బా గ్రామంలో రిజర్వాయర్ ఏర్పాటుచేసి నీటి సరఫరా చేయడంతో మోటార్ల నిర్వహణ సరిగా లేక కొన్ని సందర్భాల్లో పైపులు పగిలి నీటి సరఫరా ఆగిపోతే మొదట ఇబ్బంది పడింది ధర్మపురి ప్రజలే అని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అట్టి ఇబ్బందుల నిర్వహణకు కొత్త మోటార్ల కొనుగోలుకు కోసం కోటి రూపాయల ప్రపోజల్స్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

ధర్మపురి మున్సిపాలిటీలో కార్యాలయ ప్రాంగణంలో గురువారం నూతన వాటర్ ట్యాంకర్లను ప్రారంభించిన అనంతరం కమలాపూర్ ఇందిరమ్మ కాలనిలో నిర్మాణంలో ఉన్న బస్తీ దవాఖాన, చిల్డ్రన్స్ పార్కులను పరిశీలించి అమృత్ తాగునీటి పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
👉అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..
నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో ధర్మపురి మున్సిపల్ లో త్రాగునీటి శాశ్వత పరిష్కారం కోసం పలు సమావేశాలు నిర్వహించి, తాగునీటి సమస్య పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చూసినట్టు ఎమ్మెల్యే వివరించారు.

మాజీ మంత్రి స్వర్గీయ రత్నాకర్ రావు బోల్ చెరువు వద్ద ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి ధర్మపురి ప్రాంతానికి నీటిని ఇచ్చే కార్యక్రమం చేసినప్పటికీ గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ఈ పథకాన్ని పట్టించుకోకుండా వృధా చేశారని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
ధర్మపురి పట్టణంతోపాటు నియోజకవర్గంలో త్రాగు నీటికి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని, దాని కొరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్న అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.