దాది రతన్ మోహినీ జీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం !

J.SURENDER KUMAR,

బ్రహ్మకుమారీస్ గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌ గా విశిష్ట సేవలందించిన రాజ యోగిని దాది రతన్ మోహినీ జీ  మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


ఆదర్శవంతమైన దాది జీ  జీవితం ఆధ్యాత్మిక బలానికి, నిర్మలత్వానికి, విశ్వ సోదరభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని కొనియాడారు. వారి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా, మార్గదర్శిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి  ఒక సందేశంలో పేర్కొన్నారు.


దాది జీ  భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా 140కి పైగా దేశాల్లో విస్తరింపజేసి, సమాజానికి శాంతి, మానవతా విలువల సందేశాన్ని అందించారని గుర్తుచేసుకున్నారు. దాది జీ  మృతి రాష్ట్రానికి, దేశానికి,  ఆధ్యాత్మిక విశ్వానికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. దాది రతన్ మోహినీ జీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.