ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు !

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

రాత్రి పగలు  కష్టపడి రైతాంగం పండించి అమ్మకానికి తెచ్చిన వరి ధాన్యం కొనుగోలులో తాలు, తప్ప, కటింగ్ పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేస్తే వారిపై శాఖా పరంగా చట్టారీత్యా కఠిన చర్యలు చేపట్టనున్నట్టు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి సింగిల్ విండో ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ లో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ …

నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్ కి పంపించి రైతులకి ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా చూడాలన్నారు.
  రైతులు 17% తేమ తో ధాన్యాన్ని కేంద్రానికి తీసుకవచ్చి మద్దతు ధర క్వింటాలు కి గ్రేడ్ A ₹ 2320/- సాధారణ రకం ₹ 2300  పొందాలన్నారు.


👉 రాయపట్నం లో…


ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు.


వడ్ల కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చూసుకోవాలనీ, వడ్లు కటింగ్ లేకుండా చూసుకోవాలి, గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్న నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు.