ధర్మపురి అభివృద్ధికి  కృషి చేస్తాను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉 బ్రాహ్మణ సంఘ భవనంలో నూతన అంబులెన్స్  ప్రారంభోత్సవ కార్యక్రమంలో..


J.SURENDER KUMAR,


పరమ పవిత్రమైన ధర్మపురి క్షేత్ర ప్రాంత అభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తానని, బ్రాహ్మణ సంఘ, గాయత్రి నిత్య అన్నదాన సత్రం అన్నపూర్ణ సేవాసమితి నిర్వహణలో నూతన అంబులెన్స్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి పట్టణ కేంద్రంలోని బ్రాహ్మణ సంఘంలో ప్రజల సౌకర్యార్థం మంథని సీతారామ సేవసదన్ వారి సౌజన్యంతో బహుకరించిన అంబులెన్స్ ను శుక్రవారం ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.


పట్టణ మండల అన్ని వర్గాల ప్రజల సౌలభ్యం కోసం అంబులెన్స్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. స్థానికులు, అర్చకులు వేద పండితుల అధికారులు  సహకారంతో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందని, ఆలయ అర్చకులు, వేద పండితులు అధికారుల సూచనల మేరకు స్వామి వారి కళ్యాణాన్ని మొదటి సారి బయట శ్రీ మఠం మైదానంలో  నిర్వహించడం జరిగిందన్నారు.


గోదావరి నదిలో సివరాజ్ నీరు కలవకుండా సివరెజ్ ప్లాంట్ ఏర్పాటుకు  అన్ని చర్యలు తీసుకుంటామని, ధర్మపురి ప్రాంత అభివృద్ధికి ఎల్లవేళలా కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.