J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గానికి మహర్దశ పట్టింది అభివృద్ధి పనులు పై ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభివృద్ధి పనులకు, నిధుల మంజూరు కోసం వినతిపత్రం ఇచ్చారు.
ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, జైవీర్ రెడ్డి లతో కలసి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, సీఎం ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం ఇచ్చారు.
నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల మంజూరు, సివరెజ్ ప్లాంట్ ఏర్పాటు, ధర్మపురి దేవాలయ అభివృద్ధికి నిధుల కేటాయింపు వంటి తదితర అంశాలపై సీఎం దాదాపు 30 నిమిషాలు పాటు సమీక్షించారు.
ప్రాచీన పుణ్యక్షేత్రంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు, వేద పండితులకు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి కి వివరించారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు పవిత్ర గోదావరిలో స్నానాలు చేస్తారని, మురుగు నీరు గోదావరిలో కలిసి దుర్గంధం రావడంతో భక్తులు స్నానాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని మురికి నీరు గోదావరిలో కలవకుండా ధర్మపురి పట్టణంలో ₹ 17 కోట్లలతో సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేయాలని, విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ₹ 22 కోట్ల ల నిధులను కేటాయించాలని సీఎం ను కోరారు.
నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక ఈ ప్రాంత విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి విద్యనభ్యసించాల్సి వస్తుందని, విద్యార్థుల సౌకర్యార్థం డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, వినతి పత్రంలో పేర్కొంటూ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారని విప్ లక్ష్మణ్ కుమార్ వివరిస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.