J.SURENDER KUMAR,
ధర్మపురి బార్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నికైన సభ్యులు బుధవారం మన స్వీకారం చేశారు.
ఎన్నికల అధికారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జి శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొనారు.
అధ్యక్షునిగా ఆలుక వినోద్ కుమార్, ఉపాధ్యక్షునిగా బందెల రమేష్, ప్రధాన కార్యదర్శి గా మామిడాల శ్రీకాంత్ కుమార్ , సంయుక్త కార్యదర్శి గా గూడ జితేందర్ రెడ్డి , కోశాధికారి జజాల రమేష్, క్రీడ సంస్కృతిక కార్యదర్శి బత్తిని ఇంద్రకరణ్, గ్రంథాలయ కార్యదర్శి గా సుంకే రాజు, సీనియర్ కార్యవర్గ సభ్యులుగా గడ్డం సత్యనారాయణ రెడ్డి, అప్పాల నిరంజన్, కార్యవర్గ సభ్యులుగా కస్తూరి శరత్ కుమార్, ఒరగంటి చంద్రశేఖర్ లుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమం లో జగిత్యాలకు చెందిన సీనియర్ న్యాయవాదులైన బెత్తేపు లక్ష్మణ్, మారిశెట్టి ప్రతాప్, కే వేంకటేశ్వర రావ్, ఎర్ర నర్సయ్య, దుమ్మేనా శ్రీనివాస్, రౌత్ రాజేష్, AGP ఇమ్మడి శ్రీనివాస్, గంగాధర్, కే గంగరాజం, కార్తీక్ తదితరులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.