👉 జాతర 13 రోజులకు ప్రత్యేక హుండీలు ఏర్పాటు చేశారా ?
👉 దిట్టం నిర్వహణ ఆ ఉద్యోగికే పట్టం !
👉 సరుకులు నాణ్యత ప్రమాణాలు పరిశీలిస్తున్నారా ?
J.SURENDER KUMAR,
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర ఉత్సవాలు గత నెల మార్చి మాసంలో అంగరంగ వైభవంగా కనుల పండగ జరిగింది. 13 రోజులపాటు జరిగిన జాతర ఉత్సవాలలో నరసింహుడి ఆదాయం గత జాతర ఆదాయం కంటే దాదాపు ₹ 9 లక్షల 75 వేలు అధికంగా వచ్చినట్టు అధికారులు తెలిపారు.
జాతర ఆదాయం పెరిగిందా ? ఆలయ అధికారులు పెంచారా ? అనే అంశం లో భక్తజనం తర్జనభర్జన పడుతున్నారు. ఇందుకు కారణం ఆలయ అధికారులు జారీ చేసిన జాతర ఆదాయ ప్రకటన..
👉 భక్తుల ప్రశంసలు పొందిన కళ్యాణ వేదిక !
జాతర ఉత్సవాలలో ప్రధాన ఉత్సవమైన స్వామివారి వార్షిక కళ్యాణం. ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదికపై గతంలో నిర్వహించేవారు ఒకవేళ ప్రాంగణం సరిపడక భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించడానికి ఇబ్బందులు పడేవారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ప్రత్యేక చొరవతో గోదావరి తీరంలోని శ్రీ మఠం లోని నాలుగు ఎకరాలు ప్రాంగణంలో ప్రత్యేక కళ్యాణ వేదిక ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన స్వామివారి కళ్యాణం వేలాది మంది తిలకించడంతోపాటు కళ్యాణ వేదిక ఏర్పాటు పై ప్రశంసల వర్షం కురిపించారు.
జాతరలో మూడు రోజుల డోలోత్సవం, తెప్పోత్సవం, రథోత్సవం ప్రధాన ఉత్సవాలలో భక్తజనం, భారీగా ఆదాయం వస్తుంది.

👉 ఆలయ అధికారులు ప్రకటించిన జాతర ఆదాయ వివరాలు !
10-03-2025 నుండి 22-03-2025 వరకు
బ్రహ్మోత్సవముల సందర్భముగా 13 రోజులలో దేవస్థానమునకు వచ్చిన ఆదాయం వివరాలు ఆలయ అధికారులు ప్రకటన మేరకు ఇలా ఉన్నాయి .
👉 వివిధ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయము
₹ 26,54,646.00/-
👉 ప్రసాదముల ద్వారా వచ్చిన ఆదాయము
₹ 26,66,465.00/-
👉 అన్నదానము విరాళముల ద్వారా వచ్చిన ఆదాయము ₹ 7,02,896.00/-
👉 హుండీ ఆదాయం ₹ 38,02,628.00/-
మొత్తము ఆదాయము ₹98,26,635.00/-
👉 గత సంవత్సరము వచ్చిన మొత్తము ఆదాయం ₹ 88,51,604.00/-
👉 గత సంవత్సరము కన్న ఎక్కువగా వచ్చిన ఆదాయము ₹ 9,75,031.00/- అని పేర్కొన్నారు.
👉 జాతర లో హుండీ ఆదాయం ఎలా వచ్చింది ?
జాతరలో 13 రోజుల కోసం ఆలయంలో ప్రత్యేకంగా హుండీలు ఏర్పాటు చేయలేదు.
హుండీ ఆదాయం లెక్కించడానికి ముందస్తుగా హుండీ లెక్కింపు ప్రకటన జారీ చేయాలి. దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి సమక్షంలో హుండీ లెక్కించాలి. హుండీ లెక్కింపులో మిశ్రమ బంగారం, వెండి, విదేశీ కరెన్సీ నోట్లు ఉండి ఉంటే హుండీ ఆదాయం రిజిస్టర్ లో నమోదు చేసి సంతకాలు చేయాలి. ఈ విధానం పాటించారో ? లేదో ? రికార్డులు పరిశీలిస్తే వెలుగు చూస్తాయి.
👉 ప్రతిరోజు హుండీలో ₹ 3 లక్షలు చొప్పున భక్తులు వేశారా ?
👉 జాతర హుండీ ఆదాయం ₹ 38,02,628.00 అధికారులు ప్రకటించారు. ఇందులో మిశ్రమ బంగారం , వెండి, విదేశీ కరెన్సీ వివరాలు లేకపోవడం ప్రత్యేకం !
👉 81 రోజులో హుండీ ఆదాయం అంటూ ఆలయ అధికారులు గత నెల 21 న జారీ చేసిన ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి.

👉 81 రోజులకు సంబందించినవి 30-డిసెంబర్ 2024 నుండి 21-మార్చి-2025 వరకు విప్పి లెక్కించ గా మొత్తం ఆదాయము ₹66,02,628/-
👉 మిశ్రమ బంగారము 59 గ్రాములు,
👉 మిశ్రమ వెండి 8 కిలోల 400 గ్రాములు
👉 విదేశీ నొట్లు 37 వచ్చినట్టు అధికారుల ప్రకటన లో వివరించారు.
👉 హుండీ లెక్కింపులో..
సహాయ కమీషనర్, , కరీంనగర్ దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.శ్రీనివాస్ పాలకవర్గ అధ్యక్షులు, ధర్మకర్తలు తెలంగాణ గ్రామీన బ్యాంక్,, మేనేజర్ & సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు దేవస్థాన అర్చకులు & సిబ్బంది, భక్తులు సమక్షంలో హుండీ లెక్కింపు జరిగినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా 13 రోజుల జాతర లో హుండీ లెక్కింపు ఆదాయం ఎప్పుడు చేశారు ? ఎలా చేశారు ? ఎవరి సమక్షంలో లెక్కించారు ? గత జాతర ఆదాయం అంటే దాదాపు ₹ 9 లక్షలు అధికంగా వచ్చినట్టు ఎవరి మెప్పుదల కోసమా ? ప్రసన్నం చేసుకోవడం కోసమా ? అధికారులే భక్తులకు వివరించాలి.
👉 ఉచిత అన్నదాన ఆదాయ వివరాలు ఏవి ?
జాతర 13 రోజులపాటు స్థానిక రైస్ మిల్ అసోసియేషన్, వర్తక వ్యాపార సంఘాలు భక్తులకు ఓల్డ్ టీటీడీలో ఉచిత అన్నదానం నిర్వహిస్తారు. వారి వ్యాపారాలను వదిలి స్వచ్ఛందంగా సేవలు చేస్తూ రుచికరమైన భోజనమును భక్తులకు అందిస్తూ ప్రశంసలు పొందుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రైస్ మిల్లు, వర్తక వ్యాపార, ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఉచిత అన్నదానంలో భక్తులకు సేవలు అందిస్తుంటారు.
చాలామంది భక్తులు వర్తక వ్యాపారులు ఈ అన్నదాన కార్యక్రమానికి వస్తు రూపంలో ( బియ్యం పప్పు ఉప్పు నూనె, కూరగాయలు కిరాణా సరుకులు ) తో పాటు ధన రూపంలో నిర్వాహకులకు సమర్పిస్తారు. అయితే వీటి ఆదాయ వ్యయాలు నిర్వాహకులు ఆలయ అధికారులకు తెలుపుతారో ? లేదో ? మరో సంవత్సరం జాతరలో వినియోగిస్తారో ? అనే విషయంలో స్పష్టత లేదు.
👉 కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ వివరణ !
వరుస ఎన్నికలు, కోడ్ అమలులో ఉండడం హుండీ లెక్కింపు జరగలేదు. 81 రోజుల హుండీ ఆదాయంలో 52 % 13 రోజుల జాతర హుండీ ఆదాయం వచ్చినట్టు పరిగణించినట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాస్ వివరించారు.
👉 ఇతర ఉద్యోగులు వద్దు ఆయనే ముద్దు !
దిట్టం నిర్వహణ ఆ ఉద్యోగికే పట్టం !
ఆలయం లో భక్తులకు ఉచిత అన్నదానం, ప్రసాదాల తయారీ, దేవుడికి నిత్య నివేదన తదితర కిరాణా సరుకుల నిర్వహణ బాధ్యతలు గత దశాబ్ద కాలంగా ఓకే ఉద్యోగి నిర్వహించడం ప్రత్యేకం. ఈ బాధ్యత నిర్వహణకు ఇతర ఉద్యోగులు వద్దు ఓకే ఒక్క ఉద్యోగి ముద్దు అంటూ ఆలయ అధికారులు అతడినే కొనసాగించడంతో ఆలయ నిర్వాహకుల పై ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఆలయానికి నూతన టెండర్ దారుడు కిరాణా సరుకులు పంపిణీ ప్రక్రియ మొదలైంది.
దీనికి కారణం గత రెండు సంవత్సరాల క్రితం దేవాదాయ డిప్యూటీ కమిషనర్ ధర్మపురి ఆలయ సరుకుల గోదాంలో ఆకస్మిక తనిఖీలలో ఆ ఉద్యోగి అవినీతి ఉదంతం వెలుగు చూసింది. దీంతో ఆ ఉద్యోగిని బాధ్యతల నుంచి తప్పించారు. లెక్కలు తక్కువ ఉన్న సరుకులను ఆ ఉద్యోగి ద్వారానే కొనుగోలు చేయించారు. రికార్డులను స్పష్టంగా రాయడంతో పాటు ఆ ఉద్యోగికి సంజాయిషీ నోటీసు కూడా జారీ చేశారు.

👉 డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన సంజాయిషీ
నోటీసు ( ఫైల్ ప్రతి )
ఆరోపణలు ఉన్న ఆ ఉద్యోగి కే దిట్టం నిర్వహణ బాధ్యతలు అధికారులు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటో ? అంతు బట్టనీ చిదంబర రహస్యం గా మిగిలింది.
👉 కిరణ సరుకుల ఆర్డర్ వివరాలు, వచ్చిన సరుకుల తనిఖీలు చేయాలి !
ఆలయానికి అవసరం ఉన్న సరుకుల ఇండెంట్ వివరాలు పాలకవర్గ సభ్యులకు, అర్చకులకు, అధికారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి ఇండెంట్ చూపించాలి. సరుకులు సప్లై చేసే వ్యాపారి నుంచి వచ్చిన సరుకులు నాణ్యత ప్రమాణాలను ( క్వాలిటీ, క్వాంటిటీ ) పాలకవర్గ సభ్యులు, అర్చకులు, అధికారులు తనిఖీ చేసి టెండర్ పొందిన వ్యాపారి అగ్రిమెంట్ ప్రకారం బ్రాండెడ్ సరుకులు పంపించాడా ? లేదా ? తనిఖీ తో పాటు టెండర్ పొందిన వ్యాపారి ఆలయ అధికారులతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ మేరకు ఇచ్చిన నమూనా ( షాంపుల్స్) సరుకులను పరిశీలించి ఆ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయా లేదా అంటూ నిర్ధారించుకోవాలి అలా ఉంటేనే వాహనంలోని సరుకులు అన్ లోడ్ చేయడానికి అనుమతించాలి.

👉 ఈ నిబంధన టెండర్ పొందిన వ్యాపారికి ఆలయ అధికారులకు మధ్య అగ్రిమెంట్ డిడ్ లో స్పష్టంగా నమోదు కాబడింది (అగ్రిమెంట్ ఫైల్ ప్రతి )
ఈ అంశాలపై ఆలయ అధికారులు, పాలకవర్గం, అర్చకులు, వేద పండితులు, ఎలా స్పందిస్తారో ? ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతారు రో ? వేచి చూడాల్సిందే.