ధర్మపురి జాతరలో ఉచిత అన్నదాన ఆదాయ వివరాలు అధికారులకు తెలుసా ?


J.SURENDER KUMAR,


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జాతర ఉత్సవాలలో భక్తులకు 9 రోజులపాటు అందించిన నాణ్యమైన ఉచిత అన్నదాన ఆదాయ, వ్యయాలు, ఆలయ అధికారులకు తెలుసా ?  నిర్వాహకులు ఆలయ కార్య నిర్వాహణాధికారి కి వివరించారా ? అనే చర్చ భక్తజనంలో జరుగుతున్నది.

👉 వివరాల్లోకి వెళితే..

జాతర ఉత్సవాలకు స్వామివారి దర్శనం కోసం నిత్యం తరలివచ్చే వేలాదిమంది భక్తజనం కు  అన్నదానం స్థానిక రైస్ మిల్ అసోసియేషన్, వర్తక, వ్యాపారులు, ఇతరులు స్వచ్ఛందంగా విరాళాలతో  అన్నదాన కార్యక్రమం గత కొన్ని ఉత్సవాలలో నిర్వహిస్తున్నారు.

నాణ్యమైన సాయిరాం బియ్యంతో, రుచికరమైన భోజనం అందించాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ , నిర్వాహకులను పదేపదే కోరడం తో పాటు  వ్యక్తిగతంగా ఎమ్మెల్యే  ₹ 20 వేల నగదు అందించారు. అన్నదానం కోసం రైస్ మిల్ అసోసియేషన్, యజమానులు, అగ్ర భాగం వారితో పాటు ఇతర దాతలు నగదు, బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె తదితర సోమాగ్రి అప్పగించారు.

ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కలెక్టర్ సత్యప్రసాద్ ఈవో శ్రీనివాస్ అన్నదానం ప్రారంభించిన దృశ్యం ( ఫైల్ ఫోటో)

గత నెల మార్చి 11 న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, జగిత్యాల  కలెక్టర్ సత్యప్రసాద్, ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించడంతో పాటు, భక్తులతో కలిసి భోజనం చేశారు. తొమ్మిది రోజులపాటు వేలాది మంది భక్తులు రుచికరమైన అన్నదాన ప్రసాదం స్వీకరించారు.

👉 లక్షలాది రూపాయల దాతల విరాళాలు ?

స్వామివారి భక్తుల అన్నదాన నిర్వహణ కోసం స్థానికులు, ఇతర ప్రాంతాలకు చెందిన, దాతలు వేలాది రూపాయల నగదు ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో ధర్మారం మండల వర్తక, వ్యాపారులు దాదాపు ₹ 40 వేల నగదు ఇచ్చినట్టు ధర్మారం  వ్యాపారుల లో చర్చ. 9 రోజులపాటు జరిగిన అన్నదానంలో దాదాపు 60 క్వింటాళ్ల సాయిరాం బియ్యం, వంద కిలోల నూనె వినియోగించినట్టు, లక్షలాది రూపాయలు నగదు దాతలు ఇచ్చినట్టు సమాచారం.

నిర్వాహకులు పోపు సోమాగ్రి పచ్చళ్ళు, స్వీటు, వంట చెరుకు, వంట, పని వాళ్లకు అవసరమైన ఇతర కిరాణా సామాగ్రి   కొనుగోళ్లకు, అవసరం మేరకు చెల్లించారు అనే విషయం వాస్తవమే. జాతర ఉత్సవాల అనంతరం దాతలను, పని వాళ్లను, పాత్రికేయులను ఆలయ పక్షాన స్థానిక ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ , లక్ష్మణ్ కుమార్, కార్యనిర్వహణాధికారి, శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, చైర్మన్ జక్కు రవీందర్, వారిని సన్మానించి, స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం, మెమోటోలు  బహుకరించి అభినందించారు.

ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కలెక్టర్ సత్యప్రసాద్ ఉచిత అన్నదానంలో బోన్ చేస్తున్న దృశ్యం ( ఫైల్ ఫోటో)

👉 పచ్చళ్ళు, విస్తర్లు, టెంట్ సామాగ్రి  దేవస్థానం వారివే !

ఉచిత అన్నదాన నిర్వహణకు ఆలయానికి చెందిన  ఓల్డ్ టీటీడీ భవన ప్రాంగణం, కొన్ని గ్యాస్ సిలిండర్లు, అవసరం మేరకు విస్తర్లు , గ్లాసులు, భోజనంలో పచ్చళ్ళు , పని సిబ్బంది, విద్యుత్తు, తాగు నీటి సరఫరా స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు సమకూర్చినట్టు సమాచారం.

👉 ఆదాయ ఖర్చు వివరాలు ఇచ్చారా ?  మరిచారా ?

శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాల పేరిట నిర్వహించిన అన్నదాన ఆదాయం ఖర్చు వివరాలను  బాధ్యులైన ఆలయ అధికారులకు నిర్వాహకులు  ఇచ్చారా ? మరిచారా ?  లేక అన్నదానం నిర్వహణకు అదనంగా ఆదాయ భారం పడిందా ?  ఆదాయం మిగిలిందా ?  ఒకవేళ ఆదాయం మిగిలిన ఉంటే ఆ డబ్బు ఎక్కడ ? అనే అంశం జాతర ఉత్సవాలు ముగిసి నెల రోజులకు పైగా అవుతున్న ఆదాయ ఖర్చుల వివరాలతో ఆలయ అధికారులు స్పష్టమైన ప్రకటన మాత్రం ఈనెల 20 నాటికి చేయలేదు.

👉 కార్యనిర్వహణాధికారి వివరణ !

అన్నదాన ఆదాయం కు సంబంధించిన లెక్కలు నిర్వాహకులు చేస్తున్నారు. త్వరలో వారు ఇవ్వనున్నట్టు నాకు సమాచారం ఇచ్చారు అని   ఆలయ కార్యనిర్హణాధికారి సంకటాల శ్రీనివాస్ స్పష్టం చేశారు.