J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లో అంగరంగ వైభవంగా హనుమజ్జయంతి ఉత్సవాలు జరిగాయి.

శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయములో శనివారం చిన్న హనుమాన్ జయంతి” ఉత్సవము వైభవముగా నిర్వహించారు.

ఉదయము శ్రీస్వామి వారికి మన్యసూక్త అభిషేకము, షోడశోపచార పూజలు, నివేదన నీరాజన, మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వినియోగము జరిగాయి.
ఇట్టి కార్యక్రమములలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ సంకటాల శ్రీనివాస్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ జక్కు రవీందర్, ధర్మకర్తలు పాల్గొన్నారు.
👉 భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు !

హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ దీక్షాపరుల, భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో చల్లటి మంచినీటిసౌకర్యం ఏర్పాటు చేశారు. గోదావరి నదిలో చలువ పందిర్లు ఏర్పాటు చేశారు.

గోదావరి నదిలో ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా గోదావరి తీరంలో గల బ్రహ్మగుండం, సత్యవతి గుండంల, వద్ద ప్రమాద హెచ్చరికల ఫ్లెక్సీలు ఏర్పాటు తోపాటు గజ ఈతగాళ్లను నియమించారు.
