👉 అంబేద్కర్ రాజ్యాంగం తోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది !
👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలో ఆధునిక హంగులతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే అభివృద్ధి నిధుల నుండి ₹ 20 లక్షల రూపాయల కేటాయిస్తున్నానని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దూర దృష్టితో రచించిన రాజ్యాంగం తోనే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ అన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం ధర్మపురి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మొదట అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, భారత రాజ్యంగ నిర్మాత, న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత,సంఘ సంస్కర్త, అధ్యాపకుడు, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్, అని అన్నారు.
జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా న్యాయ శాఖ మంత్రిగా అంబేద్కర్ కొనసాగారని చేశారని, డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలకు గాను ఆ మహనీయుడి మరణాంతరం’ భారతరత్న ‘ అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగిందనీ, అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం అయిందని, ఎమ్మెల్యే అన్నారు.
ధర్మపురి పట్టణంలో పార్టీలకతీతంగా వివాద రహిత స్థలం.ఎంపిక చేసి అంబేద్కర్ భవనంతో పాటు అందులో లైబ్రరీని ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
👉 జగిత్యాల్ ఇందిరా భవన్ లో

డ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.