ధర్మపురిలో శాశ్వత తాగునీటి కోసం కృషి చేస్తా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉 పట్టణంలో ఎమ్మెల్యే పాదయాత్ర..


J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో ప్రజలకు శాశ్వత తాగునీటి సౌలభ్యం కోసం నా సాయ శక్తుల కృషి చేయడంతో పాటు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు జవాబు దారీగా ఉంటా అని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి పట్టణంలో  మంగళవారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్  5 వ, 13 వ వార్డులలో అధికారాలతో కలసి పాదయాత్ర చేస్తూ ప్రజలను కలుస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా  తాగునీటి, డ్రైనేజీ, విద్యుత్తు తదితర సమస్యలను ప్రజలు ఎమ్మెల్యేకు వివరించారు.

👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

ధర్మపురి పట్టణంలో తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

👉 తాగునీటి అవసరం   ఉన్న ప్రతి చోట నూతనంగా బోర్ వెల్స్ వేయించామన్నారు. 15 నెలల కాలం దాదాపు ₹ 2. 50 కోట్ల రూపాయలు తాగునీటి కోసమే పట్టణంలో వ్యయం చేసినట్టు ఎమ్మెల్యే అన్నారు.

👉 గత ప్రభుత్వ పాలకులు తలపున గోదావరి ఉన్న ధర్మపురి ప్రాంతానికి నీటిని అందించడంలో పూర్తిగా విఫలం కావడం జరిగిందనీ, ఆరోపించారు.

👉 ధర్మపురి క్షేత్రానికి ల్యాండ్ మార్క్ చింతామణి చెరువు కట్టను హైదరాబాద్ లో  ట్యాంక్ బండ్ తరహా అభివృద్ధి చేస్తామన్నారు.

👉 గోదావరి నదినుండి చింతామణి చెరువులో నీటిని నింపడానికి ఉన్న పైప్ లైన్ మరమ్మతులు చేయి ఇస్తామన్నారు.

👉 వాకింగ్ చేసే వారికి లైట్లు, ఓపెన్ జిమ్ వంటి సమస్యలను కొందరు యువకులు నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తానన్నారు.

👉 ప్రజల ద్వారా ఎన్నుకోబడిన నాయకుడు ప్రజా సమస్యలు పరిష్కారం చేసినప్పుడే ప్రజలు ఆ నాయకుడిని నమ్ముతారని, గోదావరిలో మురికి నీరు చేరకుండా సివరెజ్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా ₹ 17 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డినీ కలిసి వినతి పత్రాన్ని ఇచ్చి పరిస్థితిని వివరించానన్నారు.

👉  తాను ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల సమస్యల పరిష్కారానికి జవాబుదారీగా ఉంటానని, అధికార యంత్రాంగం ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు.

👉 తాను ఇచ్చిన ఆదేశాలతో పాటు, ప్రజలు వివరించిన సమస్యలను అధికారులు నమోదు చేసుకొని వాటిలో కొన్ని అయినా పరిష్కరించాలని, పరిష్కారం కాని సమస్యల గూర్చి ప్రజలకు  ఏ కారణం చేత కాలేదు, ఎన్ని రోజులలో  చేస్తాం అనే విషయం  ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు.

👉 తాను సమయానుకూలంగా పట్టణంలోని 15 వార్డులలో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటానని. అధికార యంత్రాంగం ఈ వేసవిలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కోరారు. తాగునీటి సమస్య ఏర్పడకుండా స్థానిక మున్సిపల్ అకౌంట్లో ₹ 35 లక్షల రూపాయలు కమిషనర్ ఆధీనంలో ఉంచామన్నారు. యుద్ధ ప్రాతిపదికన తాగునీరు అందించడం కోసం ముందస్తుగా రెండు వాటర్ ట్యాంకర్లను అందుబాటులో ఉంచాం అన్నారు.