👉 ఆ దేశ ప్రధానమంత్రి కి ప్రత్యేక సలహాదారుడు !
👉 పాలెపు రాజేశ్వర్ ప్రసాద్ !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రానికి చెందిన
పాలెపు రాజేశ్వర్ ప్రసాద్ (57) ఆఫ్రికా ఖండంలోని
‘రిపబ్లిక్ ఆఫ్ గినియా ‘ బిస్సావులో
ఎక్స్-అఫీషియో క్యాబినెట్ మంత్రి
మరియు ప్రధాన మంత్రికి
ప్రత్యేక సలహాదారు గా కొనసాగుతున్నారు.
ధర్మపురికి చెందిన పాలెపు సాంబయ్య, లక్ష్మీబాయమ్మ దంపతుల, మూడవ కుమారుడు పాలెపు రాజేశ్వర ప్రసాద్.
1988 నుండి బహుళ కంపెనీలలో నిర్వహణ , పెట్టుబడి అనుభవం కలిగిన టెక్నోప్రెన్యూర్ . అతను UAE అంతటా రిటైల్ దుకాణాల వ్యాపారాలలో రాజేశ్వర పసాద్ పాల్గొన్నారు.

గతంలో అనేక సంవత్సరాలు గా గల్ఫ్ రాజ కుటుంబీకుల పెట్టుబడి సంస్థ RAK హోల్డింగ్స్ కి ముఖ్య కార్య నిర్వహణాధికారిగా ( సీఈవో ) ఆఫ్రికా దేశాల ప్రతినిధిగా అనేక పెట్టుబడి సమావేశాల్లో పాల్గొన్నారు.
👉 ధర్మపురి క్షేత్రానికి రాక..
రాజేశ్వర ప్రసాద్ మాతృమూర్తి లక్ష్మీబాయి, గత మూడు రోజుల క్రితం హైదరాబాదులో మృతి చెందింది. స్వగ్రామం ధర్మపురి గోదావరి నదిలో ఆస్తి సంచయనానికి సోదరులతో కలిసి మంగళవారం సాయంత్రం రాజేశ్వర పసాద్ ధర్మపురికి వచ్చారు.
ప్రముఖ వేద పండితుడు మధు శంకర్ శర్మ, గోదావరి నదిలో ఆస్తి సంచయనా కార్యక్రమం నిర్వహించారు. వీరి వెంట కాంగ్రెస్ నాయకుడు సంఘనపట్ల దినేష్, సంగనపట్ల పెద్ద నరేందర్, ఉన్నారు.
👉 భారీ బందోబస్తు..
ధర్మపురి రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం, ధర్మపురి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నర్సింహారెడ్డి, పర్యవేక్షణలో పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో, వారి ఇంటి వద్ద, గోదావరి నదిలో భారీ భద్రత, బందోబస్తు ఏర్పాటు చేశారు. క్షేత్రంలోనీ తమ బంధువుల ఇంటికి వెళ్లి రాజేశ్వర పసాద్ సోదరులు కలిశారు.
వీరికి భారత ఎంబసీ ద్వారా ప్రోటోకాల్ సెక్యూరిటీని భారత, తెలంగాణ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. వీరి రాకను ప్రభుత్వ యంత్రాంగం గోప్యత పాటించింది.