ధర్మారం – ఎండపెల్లి బైపాస్ రోడ్డుకు ₹ 2 కోట్ల నిధులతో ప్రతిపాదనలు !

J.SURENDER KUMAR,

మండల కేంద్రమైన ధర్మారం నుండీ  ఎండపల్లి మండల బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ₹ 2 కోట్లు నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించామని, రోడ్డు పనులు పూర్తయితే అన్ని రంగాల్లో ధర్మారం ఎండపల్లి ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం  మీడియా సమావేశంలో   ఎమ్మెల్యే  లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.

ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ….

👉 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 15 నెలలో ధర్మారం మండలంలో ₹10 కోట్ల నిధులతో అభివృద్ధి చేశాము.

👉 అభివృద్ధి చేసుకుంటూ  సమాధానాలు చెప్తాం   కళ్ళ బొల్లి మాటలతో ప్రజలను అయోమయానికి గురిచేయం.

👉 ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాటి నుండి  ఇప్పటి వరకూ ప్రతి మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాను అన్నారు.

👉  సాగు త్రాగు నీరు అందించే విషయంలో  ఈ ప్రాంతంలో ఐటీఐ కళాశాలను ఏర్పాటుకు కృషి చేస్తున్నాను అన్నారు.

👉 పత్తిపాక రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతాలలో చివరి ఆయకట్టు వరకు సాగు నీటినీ అందిస్తామన్నారు.

👉 మేడారం రిజర్వాయర్ నిర్మాణం చేసే టప్పుడు ఈ ప్రాంత నీటి వాటా ఎంత ? అని గత ప్రభుత్వంలో మంత్రి గా ఉన్న కొప్పుల ఈశ్వర్  కేసీఆర్,  కేటీఆర్, హరీష్ రావులను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

👉 ప్రతి ఎన్నికల్లో  ఈ ప్రాంతం నుండి నాకు మంచి మెజారిటీ ఇచ్చారన్నారు.

👉 విద్యార్థులు డిగ్రీ కాలేజీ కావాలని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. త్వరలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకి కృషి చేస్తామని, గత ప్రభుత్వంలో అన్ని పనులు కాగితాలకే పరిమితమైందన్నారు.

👉 గత ప్రభుత్వంలో నిధులు లేకున్నా దొంగ ప్రొసీడింగ్స్ ఇస్తూ ప్రజలను  మోసగించారని ఆరోపించారు.
ధర్మారం మండలం అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.