👉 వైద్యాధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్.
J.SURENDER KUMAR
జగిత్యాల జిల్లాలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల సేవలు అభినందనీయమని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ అన్నారు.
బుధ వారం జాతీయ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మాత శిశు సంరక్షణ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య సిబ్బంది సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని 108 లో పనిచేసే సిబ్బంది అందిస్తున్న సేవలను కొనియాడారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందినీ శాలువాతో సత్కరించారు. రోడ్డుపై గాయపడిన క్షతగాత్రులను, డెలివరీ కోసం సిద్ధంగా ఉన్న గర్భిణీ స్త్రీలను, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు తరలించడంలో పాముకాటు కు గురైన, గుండె నొప్పి వచ్చిన బాధితులకు ఆపత్కాలంలో ఆపద్బాంధవులుగా నిలిచి ఆసుపత్రిలో చేర్చి వారిని అడ్మిట్ చేసుకునేంతవరకు ఉండి సేవలందిస్తున్నారనీ, మానవసేవయే మాధవసేవ అని పేర్కొన్నట్లుగా పనిచేస్తున్నారని అభినందించారు.

మీకు ఎల్లవేళలా తోడ్పడు అందించడానికి సిద్ధంగా ఉన్నామని మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఏ శ్రీనివాస్, 108 జిల్లా కోఆర్డినేటర్ రాము, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇంచార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ కుమారస్వామి, ఆరోగ్య విద్యా బోధకులు కటుకం భూమేశ్వర్ ,తరాల శంకర్, ఆరోగ్య విస్తీర్ణ అధికారులు రాజేశం, శ్రీధర్ 108 సిబ్బంది పాల్గొన్నారు.