👉 సిటీలో ఏనుగులు ఉంటాయా ?
J.SURENDER KUMAR,
కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాలు ముమ్మాటికి ప్రభుత్వ భూమినే. సిటీ మధ్యలో ఎక్కడైనా ఏనుగులు ఉంటాయా ? ఏ ఐ సాయంతో ఫేక్ ఫోటోలను సృష్టించి ప్రభుత్వాన్ని బద్నాం చేశారు అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూర్ అపారెల్ పార్క్ లో ₹.102 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన అత్యాధునిక దుస్తుల పరిశ్రమ “పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్” ను శుక్రవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం ఇక్కడ ఉద్యోగాలు పొందిన మహిళలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ పరిశ్రమ వల్ల ప్రస్తుతం 1600 మంది మహిళలకు ఉపాధి లభించనుంది. రాబోయే మూడేళ్లలో మరో 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఏటా ఇక్కడ 70 లక్షలకు పైగా దుస్తులు (పీసెస్) ఉత్పత్తి అవుతాయి. ఇక్కడి నుంచి ఏటా ₹ 300 కోట్ల విలువైన దుస్తులు అమెరికా, యూకే లాంటి దేశాలకు ఎగుమతి అవుతాయి నీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పీచ్ పాయింట్స్…
👉 సిరిసిల్ల ప్రజలకు సామాజిక స్పృహ ఎక్కువ. చైతన్యవంతమైన భూమి. ఎంతో మంది ప్రముఖులు ఇక్కడి నుంచే తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.
👉 నేతన్నలకు ఇప్పుడు… ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీనే అండగా ఉంటుంది. గత పాలకులు నేతన్నలకు చేసిందేం లేదు. కేవలం మాటలతోనే కాలం వెల్లదీశారు.
👉 ఏడాదిన్నర కిందట ఈ పరిశ్రమ యాజమాన్యం మమ్మల్ని సంప్రదించింది. పరిశ్రమ ఏర్పాటుకున్న సమస్యలను పరిష్కరించాం.
👉 వేములవాడ దేవాలయభివృద్ధికి గత పాలకులు చేసిందేం లేదు. మేం చిత్తశుద్ధితో ఆలయాభివృద్ధికి కృషి చేస్తున్నాం. బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించాం.
👉 ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి మేం
శాతవాహన యూనివర్సిటీని రెండు వందల ఎకరాల్లో ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లు ఈ యూనివర్సిటీని పట్టించుకోలేదు. మేం అధికారంలోకి వచ్చాకా ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ మంజూరు చేశాం.
👉 సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధి తో కృషి చేస్తోంది. కానీ… ప్రతిపక్షాలు కావాలనే పని కట్టుకొని తమ స్వార్థ రాజకీయాల కోసం మాపై దుష్ప్రచారం చేస్తున్నారు.
👉 ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతాం. చెప్పినట్లుగా ₹ 2 లక్షల రుణ మాఫీ చేశాం. సన్న రకం వడ్లకు బోనస్ ప్రకటించాం.
👉 సహచర మంత్రులతో సమన్వయం చేసుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.