J.SURENDER KUMAR,
ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ, నియోజకవర్గ మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
👉 ధర్మపురి పట్టణంలో..

ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో విప్ లక్ష్మణ్ కుమార్ పేరున ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక నంది విగ్రహం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు.
👉 ఆర్థిక సహాయం !

ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన పుట్ట నర్సయ్య గతంలో చనిపోగా వారి భార్య జమున సైతం మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ జన్మదినం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ₹ 21 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి పిల్లలకు అందజేశారు.
👉 నేరెళ్లలో….

నేరెళ్ళ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదినం సందర్భంగా నేరెళ్ల శ్రీ సాంబశివ దేవస్థానం లో అర్చన, ప్రత్యెక పూజలు నిర్వహించారు. లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి రావాలని వారు పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి న్యాయవాది జాజాల రమేష్ తాజా మాజీ ఎంపీటీసీ సభ్యులు రెడ్డవేని సత్యం ఆంజనేయ స్వామి దీక్ష పరులకు శ్రీ సాంబ శివున్ని ఆలయం వద్ద బిక్ష ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ శేర్ల రాజేశం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ జంగిలి తిరుపతి నాయకులు మెడిశెట్టి లక్ష్మణ్ రాజారాపు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు
👉 రాజారాం లో..

రాజారం గ్రామంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు రంగు అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. అనంతరం ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి వారికి స్వీట్ల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గాజుల రమేష్, జెల్ల సాయి కుమార్ , అనుమల్ల శంకర్, మచ్చ లక్ష్మీపతి, పప్పుల ప్రభాకర్, మచ్చ గంగాధర్, సింగం సత్తయ్య, కడ మహేష్, శంకర్, మల్లేష్, పుట్టపాక రాజన్న, భూమయ్య, శ్రీనివాస్, మల్లయ్య ,భీమయ్య ,తదితరులు పాల్గొన్నారు
👉 జైన లో

జైన గ్రామంలో ధర్మపురి నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు కుంట సుధాకర్ అధ్వర్యంలో కేక్ కట్ చెసి జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం స్వీట్లు పంచారు
👉 బుగ్గారం లో రక్త దాన శిబిరం ..

బుగ్గారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల సుభాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభిమానులు సుమారు 50 మంది రక్తదానం చేశారు. తదనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వేముల సుభాష్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పై పాటను ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా విడుదల చేశారు.